2 వారాలుగా నిలకడగానే పెట్రోల్, డీజిల్‌ ధరలు.. ఎందుకో తెలుసా?

Durga Writes

పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు వారాలుగా స్థిరంగా కొనసాగుతున్నాయి.. నిజానికి ఇది కూడా ఒక శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ భారీగా తగ్గినా తర్వాత పెరగకుండా.. తగ్గినా చోటే స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే నిజానికి ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా.. తక్కకుండా రెండు వారాల పాటు ఇలా నిలకడగా కొనసాగడానికి ఒక కారణం ఉంది. 

 

అది ఏంటి అంటే? ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మన దేశంలో కూడా అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఏప్రిల్ 14వ తేదీ వరుకు ప్రజలు ఎవరు కూడా బయటకు రాకూడదు అని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రజలు కూడా బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. దీంతో హైదరాబాద్‌లో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. మరి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఏప్రిల్ 14 తర్వాత ఎలా ఉంటాయి అనేది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: