బిజినెస్: మీకు బ్యాంక్ అకౌంట్‌ ఉందా? 5 అదిరిపోయే లాభాలు.. అవేంటంటే?

Durga Writes

బ్యాంక్.. ఇది తెలియని వారు ఉండరు.. ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటె ఎన్ని లాభాలో తెలుసా ? ఒకటా ? రెండా ? అదిరిపోయే లాభాలు ఈ బ్యాంకు అకౌంట్ వల్ల ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ లో కేవలం డబ్బు జమ చెయ్యడం.. దాచుకోవడానికి మాత్రమే కాదు.. ఎన్నో అదిరిపోయే లాభాలు ఉంటాయి. అయితే ఆ అదిరిపోయే లాభాలలో 5ప్రధాన లాభాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

ఇంట్లో ఉన్న డబ్బును అందులో డిపాజిట్ చేసి దాచుకోవడమే కాదు మనం బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బుకు వడ్డీ కూడా వస్తుంది.

 

బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్లు చేయొచ్చు. రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ), మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) వంటి వాటిని ప్రారంభించొచ్చు. 

 

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ తో పన్ను చెల్లింపు, లోన్ ఈఎంఐ, ఇన్సూరెన్స్ ప్రీమియం సహా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో దాదాపు ఏ రకమైన బిల్లునైనా చెల్లించవచ్చు.

 

బ్యాంక్ అకౌంట్‌తో పేటీఎం, గూగుల్ పే, భీమ్, ఫోన్‌పే వంటి యాప్స్‌తో అనుసంధానం చేసుకోని యూపీఐ ట్రాన్సాక్షన్లను నిర్వహించొచ్చు. 

 

ప్రిఅప్రూడ్ లోన్స్, స్పెషల్ లిమిట్స్‌తో కూడిన క్రెడిట్ కార్డ్స్, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్, కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్, రివార్డ్స్, డిస్కౌంట్స్, సర్వీస్ చార్జీల మినహాయింపు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఇలా పలు రకాల సర్వీసులు ఉంటాయి.

 

చూశారుగా.. బ్యాంకు ఖాతా ఉంటె ఎన్ని లాభాలు ఉంటాయి అనేది.. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే బ్యాంకు ఖాతాను తెరవండి.. ఈ ప్రయోజనాలను పొందండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: