తస్మాత్ జాగ్రత్త.. మీ వాట్సాప్ ను మరింత జాగ్రత్తగా కాపాడుకోండి.
మీ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు అందరి ముందు ప్రత్యక్షం కావాలని ఉందా? అయితే వాట్సాప్ ను వాడకండి. మీకు సంబంధించిన సమాచారం భద్రంగా ఉండాలంటే వాట్సాప్ ను వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయడం మంచిది. అంటూ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పరేల్ దురోవ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాట్సాప్ ను ఉపయోగిస్తున్న వారి మొబైల్స్ లో గల ఫొటోలు, వీడియోలను వాట్సాప్ తస్కరిస్తుందని, దీనికోసం ఒక ట్రోజాన్ ను ఉపయోగిస్తుందని డురోవ్ తెలియచేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆయన తన టెలిగ్రాం ఖాతాలో ఒక పోస్ట్ కూడా పెట్టడం కూడా జరిగింది.
వాట్సాప్ ను కొనుగోలు చేయకముందు నుంచే ఫేస్ బుక్ వినియోగదారుల డేటాను తస్కరిస్తుందని ఆరోపణలు చేయడం జరిగింది. తన వినియోగదారుల గోప్యతను అమ్ముకున్నానని వాట్సాప్ వ్యవస్థాపకులు ఫేస్ బుక్ కు అమ్మకం సందర్భంగా చేసిన వ్యాఖ్యను డురోవ్ మరో సారి గుర్తు చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ కు 160 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, టెలిగ్రామ్ ను 20 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు.
వాట్సాప్ మీద జరిగినన్ని హ్యాకింగ్ దాడులు టెలిగ్రామ్ పై ఎందుకు జరగడం లేదు అని టెక్ నిపుణులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వాట్సాప్ పై సైబర్ దాడులు ఎక్కువగా ఉండడంతో డురోవ్ తన ప్రత్యర్థి కంపెనీపై ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారని టెక్ నిపుణులు అంటున్నారు.
ఇక వాట్సాప్ లో ఉన్న భద్రతా లోపం బయటకు రావడంతో తమ వినియోగదారులను యాప్ ను వెంటనే అప్ డేట్ చేసుకోవాలని వాటర్ సంస్థ తెలియచేయడం జరిగింది. ఈ భద్రతా లోపం హ్యాకర్లకు స్మార్ట్ ఫోన్ ను హ్యాకింగ్ చేయడానికి ఓ మంచి అవకాశంగా ఉంది. కేవలం ఒక MP4 ఫైల్ ద్వారా హ్యాకర్లు మీ స్మార్ట్ ఫోన్ ల్లోకి చొరబడి తమకు కావల్సిన డేటాను సహకరిస్తున్నారు.