అద్గది నందమూరి బిడ్డ అంటే ఇది.. 2027లో బాలయ్య డబుల్ ధమాకా సర్ప్రైజులు!
అదేవిధంగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సహా బాలయ్య వచ్చే ప్రాజెక్టులు అన్నీ కూడా వచ్చే ఏడాదిలోనే థియేటర్లలోకి రానున్నాయని సమాచారం. ముఖ్యంగా 2027 సంక్రాంతి సందర్భంగా బాలయ్య 111వ సినిమా విడుదల కానుండగా, అదే ఏడాది దసరా కానుకగా మరో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే, బాలయ్య అభిమానులకు 2027 సంవత్సరం నిజంగానే పండుగలా మారుతుంది. ఒకే ఏడాదిలో రెండు భారీ సినిమాలతో బాలయ్య థియేటర్లలో సందడి చేయడం ఖాయం అవుతుంది. అయితే, బాలయ్య – కొరటాల శివ కాంబినేషన్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మొత్తంగా చూస్తే, బాలయ్య నుంచి రాబోయే ప్రాజెక్టులు ఇండస్ట్రీలో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలు ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి. ఖచ్చితంగా బాలయ్య సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ కొడతాయి అంటూ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??