
అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ బెటరా.. ఎలాగో తేల్చి చెప్పిన రేవంత్?
హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నామన్న రేవంత్ రెడ్డి... 30 వేల ఎకరాల్లో అద్భుతమైన నగరం నిర్మించే పని ప్రారంభించామన్నారు. గుజరాత్, అహ్మదాబాద్‌లో అటువంటి నగరం ఎక్కడైనా ఉందా.. కోవిడ్ సమయంలో ఔషధాలు ఎక్కడ తయారయ్యాయి. మూడో వంతు ఔషధాలు మేం సరఫరా చేశాం. భారతదేశంలోని 35 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. ఐటీ గురించి మేం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అహ్మదాబాద్‌లో ఐటీ ఏం ఉంది.. అహ్మదాబాద్ ఐటీ, హైదరాబాద్ ఐటీ ఎగుమతులు చూడండి అని రేవంత్ రెడ్డి అన్నారు.