
టన్నెల్ లో చిక్కుకున్న వారి కోసం రేవంత్ ఏం చేస్తున్నారో తెలుసా?
సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గాయపడ్డ వారి పరిస్థితిని రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని రేవంత్ రెడ్డి చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలికి చేరుకోనున్నాయని మంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. సహాయక చర్యల విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.