
టీడీపీలో ఫైబర్ నెట్ గొడవ.. చూద్దాంలే అంటున్న మంత్రి?
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ దినేష్ కుమార్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి జీవీ రెడ్డి.. శనివారం సాయంత్రంలోగా ఈ వ్యవహారంలో రాతపూర్వక వివరణ ఇవ్వాలని దినేష్ కుమార్ ను ఆదేశించారు. మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని జీవీరెడ్డికి మంత్రి కార్యాలయం లేఖ రాసింది. రెండు రోజుల్లోగా దీనిపై ఆధారాలు సమర్పిస్తామని ఏపీఎఫ్ఎస్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఈ వివరణలు వచ్చాక ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లాలని మంత్రి జనార్ధన్ రెడ్డి నిర్ణయించినట్టు తెలిసింది.