మహాశివరాత్రి కోసం తెలంగాణ ఆర్టీసీ అదిరే ఏర్పాట్లు?
మహాశివరాత్రి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడిపించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల , కీసర పాలకుర్తి దేవాలయాలకు వెళ్ళే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
గత సంవత్సరం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు..రూపొందించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బస్ స్టాండ్ ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.