ప్రతిజంట ఇద్దరిని కనాల్సిందే.. బాబు కొత్త రూల్‌?

Chakravarthi Kalyan
జనాభా తగ్గుదలపై చంద్రబాబు ఇటీవల తరచూ ప్రస్తావిస్తున్నారు. తాజాగా కుప్పం పర్యటనలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రతి జంట ఇద్దరికి జన్మనిచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న సీఎం చంద్రబాబు.. కుప్పం నుంచే ఈ విధానం ప్రయోగాత్మకంగా చేపడతామని అన్నారు. కుప్పంలో జననాల రేషియో 1.5 కు పడిపోయిందన్న సీఎం చంద్రబాబు.. ఆ జననాల రేషియో 2.1 కు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.
 
అలాగే నీటి భద్రత కు ప్రాధాన్యత ఇస్తామన్న సీఎం చంద్రబాబు.. జూన్ లోపు హంద్రీనీవా జలాలు పాలారు వాగుకు తెస్తామన్నారు. పాలారువాగుపై చెక్ డ్యాం నిర్మాణం చేపడతామన్నారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకురావడానికి రూ.80 వేల కోట్ల తో తెస్తామన్నారు.
భూమిని జలాశయం గా మార్చే ప్రయత్నం చేస్తామన్నారు.

వర్షాకాలానికి ముందే 8 మీటర్ల భూగర్భజలాలు ఉండేలా చర్యలు ఉంటాయన్న సీఎం చంద్రబాబు.. అధికంగా పడిన వర్షాలను సద్వినియోగం చేశామన్నారు. 73 శాతం జలాశయాల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకొన్నామని.. రైతులకు వ్యవసాయ యంత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని.. కరెంటు బిల్లులు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని.. స్వచ్ఛ కుప్పం ద్వారా పారిశుద్ధ్యం మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.  

వీలైనంత త్వరలో స్వచ్ఛ కుప్పం చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్న చంద్రబాబు... సాంకేతికతను అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: