హైదరాబాద్‌కు మరో మణిహారం.. అదిరే సౌకర్యం..?

Chakravarthi Kalyan
ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌లో మరో కొత్త సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. ఇవాళ ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్ ప్రారంభం కాబోతోంది. ఈ సాయంత్రం 4 గంటలకు ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్ కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్ దాదాపు  4 కిలోమీటర్ల పొడవు ఉంది.

ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్ ను మొత్తం ఆరు వరుసల్లో జీహెచ్ ఎంసీ నిర్మించింది. ఎస్ ఆర్ డీపీ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.799 కోట్ల అంచనా వ్యయం అయ్యింది. ఈ ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్.. హైదరాబాద్‌ నగరంలో పీవీ ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత రెండో అతిపెద్ద వంతెనగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: