ఆ చట్టంపై ప్రచారం పెంచాలంటున్న రేవంత్ రెడ్డి?
రైతులకు, ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత వేగంగా, సులభంగా అందించే లక్ష్యంతోనే భూభారతిని తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. భూ భారతి చట్టంపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం జరిగేట్లు చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
జిల్లా స్థాయిలోనే దాదాపు అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం లభించేట్లు కొత్త చట్టం ఉందని, రెవెన్యూ అధికారులకు సైతం వివిధ స్థాయిల్లో అధికారాలను కూడా బదలాయించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.