ఇవాళ హైదరాబాద్‌లో క్యాబ్ ఫ్రీ.. ఎవరికంటే?
డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సదుపాయం అందించాలని తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ నిర్ణయించింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫోర్ వీలర్స్ అసోసియేషన్ తెలిపింది.
ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరిన ఫోర్ వీలర్ అసోసియేషన్, గిగ్ వర్కర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 500 కార్లు 250 బైక్ టాక్సీలు డ్రైవర్లు అందుబాటులో ఉంటారు. సేఫ్ జర్నీ కోసం ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉంటుందని సూచించారు.