రేవంత్‌ వర్సెస్‌ అల్లు అర్జున్‌.. దిల్‌రాజు శుభం కార్డు వేసేస్తాడా?

Chakravarthi Kalyan
ఇవాళ తెలుగు సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ లో సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు. ఉదయం 10 గంటలకు సినీ ప్రముఖులతో సీఎం భేటీ జరగనుంది. ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతోంది. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారం, ఇటీవల జరిగిన పరిణామాలపై సినీ ప్రముఖులతో సీఎం చర్చిస్తారని తెలుస్తోంది. సీఎంతో సమావేశానికి 30 మందికిపైగా సినీ ప్రముఖులు  హాజరుకానున్నారని తెలుస్తోంది.
అయితే దిల్‌ రాజు విదేశాల నుంచి రాగానే.. శ్రీతేజ్‌ కుటుంబానికి పరిహారం విషయం ఓ కొలిక్కి తెచ్చేశాడు. రెండు కోట్ల పరిహారం ఇప్పించేశాడు. ఇన్నాళ్లూ ఈ విషయంపై క్లారిటీ రాలేదు. దిల్‌ రాజ్ రాగానే అన్నీ చక్కబడుతున్నాయి. ఈ ఇష్యూని ఇంతటితో ముగించేలా దిల్ రాజు కీలక పాత్ర పోషించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: