అల్లు అరెస్ట్‌ అయ్యింది.. ఇక మోహన్‌బాబు పని పడతారా?

Chakravarthi Kalyan
నటుడు మోహన్‌బాబును త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆయనకు తాజాగా హైకోర్టులో చుక్కెదురైంది. విలేకరులపై దాడి కేసులో ఆయన నిందితుడిగా ఉన్న మోహన్‌ బాబుకు ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు కాలేదు. ముందస్తు బెయిల్ కోసం ఉన్నత న్యాయస్థానంలో మోహన్‌బాబు ఇప్పటికే పిటిషన్‌ దాఖలు చేశారు. మోహన్ బాబు అనారోగ్యంతో ఉన్నందున బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు.

అయితే.. విలేఖరిపై దాడి ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. రెండు వైపుల వాదనలు విన్న ధర్మాసనం మోహన్‌ బాబు ముందస్తు బెయిల్‌ కు అంగీకరించలేదు. ఈ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో మోహన్ బాబును ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయనకు హైకోర్టు ఇచ్చిన నోటీసుల గడువు కూడా ఇవాళ్టితో ముగిసిపోతుంది. దీంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: