మిమ్మల్ని డిజిటల్‌ అరెస్టు చేస్తారు జాగ్రత్త..?

Chakravarthi Kalyan
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టుల కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల ఈ తరహా 4500 కేసులు నమోదయ్యాయి. ఇటీవల విజయవాడలోనే డిజిటల్ అరెస్టు అంటూ 1.25 కోట్లు మోసం చేశారని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. సైబర్ క్రైమ్ లో ముందస్తు జాగ్రత్త అనేది ప్రధానమంత్రమని పేర్కొన్న డీజీపీ.. ఈ వ్యవహారాల్లో బ్యాంకులను అప్రమత్తం చేసినట్టు వెల్లడించారు.
కలెక్టర్ల సదస్సులో శాంతిభద్రతల అంశంపై డీజీపీ ద్వారకా తిరుమల రావు  ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలీసుల వ్యవస్థలో సాంకేతికత పెరగాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆ రకమైన చర్యలు చేపట్టినట్టు డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా  సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక సహకారంతో కేసుల దర్యాప్తు పూర్తి చేస్తున్నట్టు డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి కరడుకట్టిన నేరస్తుల్ని పట్టుకున్నామని తెలిపిన డీజీపీ.. సైబర్ సెక్యురిటీ పై కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: