
హనుమాన్ లాంటి బ్లాక్భస్టర్ కొట్టినా ప్రశాంత్ వర్మ ఏమయ్యాడు... కెరీర్ ఎందుకిలా..?
టాలీవుడ్ లో వైవిద్యమైన సినిమాలు చేసుకుంటూ హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమా కు ముందు ప్రశాంత్ వర్మ చేసిన సినిమా లు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా మాత్రమే కాదు.. వైవిధ్యమైన సినిమా లుగా మంచి పేరు తెచ్చుకున్నాయి. దీంతో ఒకటి రెండు సినిమా లతోనే ప్రశాంత్ టాలీవుడ్ లో అందరి దృష్టి లోనూ పడ్డాడు. ఇక టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా పై భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టి సోషియో ఫాంటసీ నేపథ్యంలో హనుమాన్ సినిమా తెరకెక్కించడం అంటే చాలా పెద్ద రిస్క్ తో కూడుకున్న పని. అయినా ప్రశాంత్ వర్మ కథను నమ్ముకుని చాలా కాన్ఫిడెన్స్ తో హనుమాన్ సినిమాను తెరకెక్కించి పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ కొట్టారు.
పైగా సంక్రాంతికి మహేష్ బాబు - నాగార్జున - విక్టరీ వెంకటేష్ లాంటి పెద్ద హీరోలు సినిమా లు పోటీలో ఉన్నా కూడా వచ్చిన హనుమాన్ సినిమా అదిరిపోయే హిట్ కొట్టింది .. పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రు . 300 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా దెబ్బతో ప్రశాంత్ వర్మ కు మామూలు క్రేజ్ రాలేదు. హిట్టు వచ్చి ఏడాది దాటిన ఇంకా కొత్త సినిమా సెట్ కావడం లేదు. ఒక సినిమా సెట్ అయినా క్యాన్సిల్ అయింది. మోక్షతో సినిమా సెట్ అయినా కూడా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. ప్రభాస్ తో సినిమా అన్నది వార్తల్లో ఉంటుంది. ఏది ఏమైనా హిట్ కొట్టినా కూడా ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకపోవడం ఆశ్చర్యకరమని చెప్పాలి.