ఏపీ: గ్రామ,వార్డ్ సచివాలయ ఉద్యోగుల పై కీలక అప్డేట్..?

FARMANULLA SHAIK
ఏపీలో కూటమి ప్రభుత్వం భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన పరిణామాలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కీలక బాధ్యతలు అప్పగించారు.ఒక్కొక్కరికి కొన్ని ఇళ్లను మ్యాప్ చేయించి పింఛన్లు పంపిణీ బాధ్యతలు అప్పగించి వారిచేతనే జులై నెల నుంచి పింఛన్లను కూడా ఇంటింటికి పంపిణీ చేయిస్తున్నారు.గత వైసీపీ పాలనలో పింఛన్ల పంపిణీని గ్రామ,వార్డు వాలంటీర్లు పంపిణీ చేసిన సంగతి తెల్సిందే అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా పెట్టింది. ఆ తర్వాత రాష్ట్రంలో పరిణామాలు మారడంతో కూటమి ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజీనామా చేసిన వాలంటీర్లు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వాలంటీర్ల వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టమై నిర్ణయాన్ని ప్రకటించలేదు. వాలంటీర్లను మాత్రం కొనసాగిస్తామని మంత్రులు చెబుతున్నారు కానీ దానిపై ఇప్పటికి ఎలాంటి ఆలోచన చేయలేదు.

ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు కొత్త ప్రభుత్వానికి కొన్ని రిక్వెస్ట్‌లు చేశారు.రాష్ట్రంలో సచివాలయాల ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని కోరారు అంతేకాదు తమకు అమలు చేస్తున్న యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న రూల్స్ వర్తింపజేయాలని కోరారు. కొన్ని సమస్యల్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లామని ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే ఈ సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసి, సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని రిక్వెస్ట్ చేశారు. అయితే యూనిఫామ్‌కు సంబంధించి అంశంపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అడిషనల్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం జిల్లాలో మండల అధికారులకు కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.దాంట్లో భాగంగానే బుధవారం నుండి గ్రామ, వార్డు సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులకు యూనిఫాం తప్పనిసరిగా ధరించాలనే ఆంక్షల్ని ఎవరూ విధించొద్దని ఆదేశించారు. దయచేసి ఈ విషయాన్ని అందరికీ తలియజేయాలని సూచించి ఈ నిబంధన ఆ జిల్లాతో పాటూ మిగిలిన అన్నీ జిల్లాల్లో అమలు చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: