చంద్రబాబు బాటలో రేవంత్‌ రెడ్డి.. అచ్చం అలాగే?

Chakravarthi Kalyan
అమెరికా టూర్‌లో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అనేక అమెరికన్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల అధిపతులతో సమావేశం అవుతున్నారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు వారిని ఒప్పిస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో ఆర్సీసీఎం కంపెనీ సీఈవో గౌరవ్ సూరీ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో కంపెనీ ఏర్పాటుకు ముందుకొచ్చిన అమెరికాకు చెందిన ఆర్సీసీఎం కంపెనీ సీఈవో గౌరవ్ సూరీ సానుకూలత వ్యక్తం చేశారు. డేటా మేనేజ్ మెంట్, డేటా స్ట్రాటజీ సేవలు అందించనున్న ఆర్సీసీఎం సంస్థ.. అమెరికా బయట మొదటిసారి కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆర్సీసీఎం కంపెనీ సీఈవో గౌరవ్ సూరీ వెల్లడించారు. అదే సమయంలో న్యూయార్క్ లోనే సీఎం రేవంత్ రెడ్డితో స్వచ్ఛ్ బయో సంస్థ ఛైర్మన్ ప్రవీణ్ పరిపాటితోనూ భేటీ అయ్యారు. తెలంగాణలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడికి స్వచ్ఛ్ బయో సంస్థ  ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో జీవఇంధన ప్లాంటు నెలకొల్పనున్నట్లు స్వచ్ఛ్ బయో కంపెనీ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: