ఆ వైసీపీ మాజీ ఎంపీ అరెస్టు తప్పదా.. చుక్కలు చూపించేస్తారా?

Chakravarthi Kalyan
విశాఖ మాజీ ఎంపీ సత్యనారాయణ అరెస్టు తప్పకపోవచ్చు. ఆయనకు తాజాగా  హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని విశాఖ మాజీ ఎంపీ సత్యనారాయణ చేసుకున్న పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. హయగ్రీవ సంస్థకు చెందిన భూముల వ్యవహారంలో విశాఖపట్నం, ఆరిలోవ ఠాణాలో ఇప్పటికే విశాఖ మాజీ ఎంపీ సత్యనారాయణపై కేసు నమోదు అయ్యింది.
ఈ కేసు కొట్టేయాలని విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హై కోర్టు లో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు..  కేసు ఎఫ్‌ఐఆర్‌ దశలో ఉన్నందున అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కావాలంటే ముందస్తు బెయిలు పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది. పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: