జగన్ రూట్లోనే బాబు కూడా.. అందుకే గెలవగానే ఆ టూర్?
ఈ మధ్యాహ్నం 12.30 గం. లకు కుప్పం పిఈఎస్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్ కు రానున్న చంద్రబాబు.. మధ్యాహ్నం 12.55 గం. శాంతిపురం మండలం జల్లిగానిపల్లి వద్ద హంద్రీ నీవా ప్రాజెక్టు కాలువను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1.35 గంటలకు శాంతిపురం మండలం చిన్నారి దొడ్డిలో హంద్రీ నీవా కాలువ పరిశీలిస్తారు. 2.10 గం. లకు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహనికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు కుప్పంలోని ఎన్టీఆర్ విగ్రహం సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు. సాయంత్రం 4.35 గంటలకు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు.