ఇరాన్ అధ్యక్షుడి మరణంలో ట్విస్ట్‌.. ఇజ్రాయెల్‌ పనేనా?

Chakravarthi Kalyan
విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచ పెద్ద దేశాల్లో ఒకటైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలవ్వడం సంచలనంగా మారింది. ఇది కేవలం ప్రమాదమా? లేక కుట్ర కోణం దాగి ఉందా? అనే అనుమానాలు ఇప్పటికే కొంత వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్-అబర్ బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన డ్యాం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఇబ్రహీం రైసీ వెళ్లారు.
అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరగి టెహ్రాన్ కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈస్ట్ అజర్ బైజాన్ ఫ్రావిన్స్ లోని వర్జాఖాన్- జోల్పా మధ్య విస్తరించి ఉన్న దట్టమైన డిజ్మర్ అడవుల్లో హెలీకాఫ్టర్ క్రాష్ అయింది. ప్రమాద సమయంలో అధ్యక్షుడు ఇబ్రహీంతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హోసైన్స్ అమీర్ అబ్దుల్లా, ఈస్ట్ అజర్ బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ వారి భద్రతా సిబ్బంది ఉన్నారు. అయితే ఈప్రమాదంలో శత్రుదేశం ఇజ్రాయెల్ పాత్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: