మార్చి మార్చి అస్త్రాలు ప్రయోగించిన బాబు.. ఏదీ వర్కవుట్‌ కాలేదా?

Chakravarthi Kalyan
ఏపీలో ఈసారి దాదాపుగా రెండు నెలల పాటు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అభ్యర్థుల జేబులకు చిల్లు అన్నట్లుగా ప్రచారం తీరు సాగిపోయింది. ప్రచార సరళిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అటు అధికార పక్షం.. ఇటు విపక్షం విశ్వప్రయత్నం చేశాయి.  ఏదో ఒక సెంటిమెంట్ ను రైజ్ చేయాలని చివరి వరకు ప్రయత్నించాయి. ఆదిలో సూపర్ సిక్స్, ఆ తర్వాత వాలంటీర్ల కొనసాగింపు, రూ.4వేల పింఛన్ ఇలా విడతల వారీగా ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు కూటమి నేతలు యత్నించినా పెద్దగా వర్కౌట్ కాలేదు.

అయితే ఈ సమయంలోనే టీడీపీ నేతలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టం బ్రహ్మాస్త్రంలా కనిపించింది. వెంటనే తడవుగా దీని గురించి ప్రచారం చేయడం మొదలు పెట్టాయి. ముందు జనసేన ఓ యాడ్ రూపంతో దీని గురించి ప్రస్తావన మొదలు పెట్టగా ఆ తర్వాత చంద్రబాబు అందుకొని దీనిని క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లారు. వాస్తవంగా ఇది ఎన్నికల ముందు నుంచి చర్చకు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: