అమరావతే మా రాజధాని.. ఓటు మాత్రం వైసీపీకే?
ఈ ఎన్నికల్లో టీడీపీ కూడా అమరావతి అంశాన్నీ కీలకంగా ప్రస్తావించలేదు. కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించే ప్రచారమంతా సాగింది. అందుకు అనుగుణంగానే పేపర్ ప్రకటనలు సాగాయి. ఇక మూడు రాజధానులు అంశాన్ని కూడా ఆయా ప్రాంత ప్రజలు కోరకుంటారు. వాళ్ల పరిసరాలు అభివృద్ధి చెంది భూములకు మంచి ధరలు వస్తాయని.. అంత మాత్రాన వీరంతా కూడా వైసీపీకి ఏకపక్షంగా ఓటేయ్యలేదు. అటు అమరావతి కానీ.. ఇటు మూడు రాజధానులు కానీ ఉండాలని ఆయా ప్రాంత వాసులు కోరుకున్నారు తప్ప దీనిని ఆధారంగా చేసుకొని ఓటింగ్ సాగలేదని పోలింగ్ సరళిని చూస్తే అర్థం అవుతుంది.