RSPపై మంద కృష్ణ మాదిగ ఫైర్‌?

Chakravarthi Kalyan
కేసీఆర్ పై అనేక విమర్శలు చేసిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అదే పార్టీలో చేరి ఉద్యమాన్ని బలహీనం చేశారని మంద కృష్ణ మాదిగ  అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాతనే తాము రాజకీయంగా వస్తామనని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమకు మేలు చేసే వారికే ఓటేస్తామని మంద కృష్ణ మాదిగ  చెప్పారు. ఎస్సీల్లో 75 శాతం ఉన్న మాదిగలను కాదని కాంగ్రెస్ , భారాస పార్టీలు మాలలకే సీట్లిచ్చాయని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు.

ఈ పార్టీలు వివక్ష చూపుతున్నందున వారికి ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి పార్టీ అనే ముద్ర ఉందని, ఎస్సీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో కూడా మాదిగలకు ప్రాధాన్యం లేదని వాపోయారు. మంత్రులుగా ఉన్న వారి కుటుంబాలకే మళ్లీ టికెట్స్ ఇవ్వడం బాధకరంగా ఉందని మంద కృష్ణ మాదిగ తెలిపారు. తన ముఖ్య మంత్రి కుర్చీని కాపాడుకోవటానికి  సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు సపోర్ట్ చేస్తున్నారన్నారు. తరతరాలుగా తాము పార్టీల జెండాలు మోసేవారిగానే మిగిలిపోతున్నామని మంద కృష్ణ మాదిగ  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rsp

సంబంధిత వార్తలు: