టీచర్‌ కావాలనుకుంటున్నారా.. మీకో గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
టీచర్ కావాలంటే టెట్‌ పాస్‌ కావడం కంపల్లరీ. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోయే ఈ టెట్ అంటే టీచర్స్ ఎలిజబిలిటి టెస్ట్ పై అవగాహన కల్పించేందుకు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ విషయాన్ని  సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఇవాళ మధ్యాహ్నాం 3గంటల నుంచి 4 వరకు టి-సాట్ నిపుణ ఛానల్ లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ వివరించారు.
అనుభవం కలిగిన ఫ్యాకల్టీచే  నిర్వహించే లైవ్ కార్యక్రమాల్లో మొదటి రోజు కెమిస్ట్రీ సబ్జెక్ట్ పై అవగాహన కార్యక్రమం ఉంటుందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ స్పష్టం చేశారు. పది రోజుల పాటు పది సబ్జెక్టులపై జరిగే ప్రత్యేక ప్రత్యక్ష్య ప్రసార కార్యక్రమాల్లో టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ సూచించారు. లైవ్ ప్రసారాలతో పాటు రికార్డింగ్ పాఠ్యాంశాలు టి-సాట్ నిపుణ ఛానళ్లతో పాటు టి-సాట్ యాప్, యూట్యూబ్ లోనూ అందుబాటులో ఉంటాయని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: