హైదరాబాద్‌లోనూ బెంగళూరు నీటి కరవు వస్తుందా?

Chakravarthi Kalyan
బెంగళూరులో మంచినీటి కరవు వణికిస్తోంది. అయితే.. మన హైదరాబాద్‌లోనూ అలాంటి పరిస్థితి వస్తుందా అన్న ఆందోళన జనంలో ఉంది. అయితే.. రిజర్వాయర్లలో తగినంత నీళ్లు ఉన్నాయని.. రానున్న వేసవిలో మంచినీటి సరఫరాపై ప్రజలు ఆందోళన పడవద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా, వేసవి జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. మరమ్మతులు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.


గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజల అవసరాలకు తగినంత నీటిని అందిస్తున్నామని.. ఎవరైనా అదనపు వాటర్ ట్యాంకులు కోరినా కూడా పంపిస్తున్నామని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.  వేసవిలోనూ రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు తలెత్తవని సీఎస్ శాంతి కుమారి అన్నారు. హమ్మయ్య.. మన హైదరాబాద్‌ సేఫ్‌ అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: