గుడ్‌న్యూస్‌: తెలుగు ప్రజలకు మోదీ మరో కానుక?

Chakravarthi Kalyan
తెలుగు ప్రజలకు గుడ్‌ న్యూస్..  సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇవాళ్టి నుంచి పట్టాలపై పరుగులు పెడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ను ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 6 రోజులు నడుస్తుంది. వారంలో ఒక్క గురువారం రోజు మాత్రం మినహాయింపు ఉంటుంటుంది. ఆరోజు వందేభారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులో ఉండదు. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్  రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 100శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తోంది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన ఉండడంతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఇప్పటికే కొనసాగుతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు అదనంగా మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: