మహిళలకు డ్రోన్లు.. మోదీ కొత్త కానుక?

Chakravarthi Kalyan
మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కేంద్రం నమో డ్రోన్ దీదీ పథకం ప్రారంభించింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను ఎంపిక చేసి వాళ్లకు డ్రోన్‌లను ఆపరేట్ చేసేలా శిక్షణ ఇస్తోంది. డ్రోన్‌లు ఇచ్చి గ్రామంలో వ్యవసాయంలో సహాయపడే విధంగా తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 110మంది మహిళలకు డ్రోన్‌లు అందించారు. రసాయన, ఫర్టిలైజర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ డ్రోన్లను మహిళలకు అందిస్తున్నారు. గ్రామంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించి వాళ్ల ద్వారా రైతులకు సాయపడే విధంగా కేంద్రం నమో డ్రోన్ దీదీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోది.. డ్రోన్ దీదీలను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. దేశవ్యాప్తంగా వేయి మందికి పైగా మహిళలకు  డ్రోన్‌లను అందజేశారు.  మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొరమాండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 110మంది మహిళలకు డ్రోన్లు అందించారు. డ్రోన్లు అందుకున్న మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: