ఇక జగన్‌ ఫినిష్‌.. పవన్‌ కల్యాణ్‌ ధీమా?

Chakravarthi Kalyan
భాజపా- తెదేపా- జనసేన పొత్తు ద్వారా ఎన్డీయేలో భాగం చేసినందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఒక దశాబ్దం పాటు సామాజిక, ఆర్థిక రాజకీయ గందరగోళం ఏర్పడిందని.. అర్ధ దశాబ్దం వైకాపా ప్రభుత్వ విధాన ఉగ్రవాదం, అవినీతి, ఇసుక, విలువైన ఖనిజాలు, సహజ వనరులను దోపిడీ జరిగిందని.. మద్యం మాఫియా, దేవాలయాల అపవిత్రత, ఎర్ర చందనం స్మగ్లింగ్ జరిగిందని పవన్‌ అంటున్నారు.

బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రతిపక్ష నాయకులు, వారి పార్టీ నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులు న్యాయవ్యవస్థను కించపరచడం, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలను బెదిరించడం జరిగాయన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.. 30,000 మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారన్నారు.
అత్యధికంగా దళితులపై అఘాయిత్యాలు ఇలా ఎన్నో ఈ పాలనలో కొనసాగాయని.. చివరకు, భాజపా- తెదేపా- జనసేన JSP కూటమి ప్రధాని మోదీ నాయకత్వంలో వీటికి ముగింపు పడుతుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: