మరో సూపర్‌ ప్రాజెక్టుకు ఇవాళ రేవంత్‌ శంకుస్థాపన?

Chakravarthi Kalyan
జాతీయ ర‌హ‌దారి -44పై 1,580 కోట్ల వ్యయంతో చేప‌ట్టనున్న 5.320 కిలోమీట‌ర్ల మేర కారిడార్ నిర్మాణానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండ్లకోయ జంక్షన్ స‌మీపంలో శంకుస్థాప‌న చేస్తారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై త‌ర్వాత మెట్రో మార్గం నిర్మిస్తారు. హైదరాబాద్ న‌గ‌రంలో తొలి డ‌బుల్ డెక్కర్ కారిడార్‌కు ప్రస్థానం ప్రారంభంకానుంది. హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌తో పాటు మేడ్చల్-మ‌ల్కాజిగిరి, మెద‌క్‌, కామారెడ్డి, నిర్మల్‌-ఆదిలాబాద్ మీదుగా సాగే ఎన్‌హెచ్‌-44పైన జంట న‌గ‌రాల్లో విప‌రీత‌మైన వాహ‌న ర‌ద్దీకి ఇది పరిష్కారం కానుంది.
ఈ మార్గంలో సికింద్రాబాద్‌లో ర‌హ‌దారి విస్తర‌ణ‌, ఎలివేటెడ్ కారిడార్‌కు కంటోన్మెంట్ ప్రాంతంలోని నిబంధ‌న‌లు ఇప్పటివరకూ ఆటంకంగా మారాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత‌లు స్వీక‌రించిన తర్వాత ఢిల్లీలో ర‌క్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి అయిదో తేదీన స్వయంగా క‌లిసి రాజధాని న‌గ‌రంలో కంటోన్మెంట్ ప్రాంతంలో ర‌హ‌దారుల విస్తర‌ణ‌ ర‌క్షణ శాఖ భూములు అడిగారు. దీంతో సమస్య పరిష్కారమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: