పని ప్రారంభిస్తున్న కేసీఆర్‌.. పరువు దక్కేనా?

Chakravarthi Kalyan
ఎంపీ ఎన్నికల్లో పరువు దక్కించుకునేందుకు కేసీఆర్‌ కసరత్తు ప్రారంభిస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఎంపీ అభ్యర్థుల ఎంపిక పని ప్రారంభిస్తున్నారు. రోజుకు రెండు లేదా మూడు నియోజకవర్గాల నేతలతో సమావేశమై అభ్యర్థిత్వాల ఖరారు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్టు చెబుతున్నారు. ఇటీవల సన్నాహక సమావేశం సందర్భంగానే నేతలు తీర్మానం కూడా చేశారు.

ఇక పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరారు. దీంతో పార్టీ ఇపుడు మరో అభ్యర్థిని చూసుకోవాల్సి ఉంది. పెద్దపల్లి రేసులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు బలంగా వినిపిస్తోంది. సీనియర్ నేత, ఉద్యమ సమయం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఈశ్వర్ సరైన అభ్యర్థి అని అంటున్నారు. ఇదే స్థానానికి మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు ప్రచారంలో ఉన్నా... ఆయన మాత్రం తనకు ఆసక్తి లేదని అంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో చర్చించి అధినేత కేసీఆర్ అభ్యర్థిత్వాలను ఖరారు చేయనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: