పవన్‌.. 40 ఏళ్ల దురంధుడు.. 23 సీట్లతో ఎందుకు ఓడాడు?

Chakravarthi Kalyan
చంద్రబాబును మొన్నటి తాడేపల్లిగూడెం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విపరీతంగా పొగిడారు. అయితే ఇది బాగా విమర్శల పాలైంది. చంద్రబాబు రాజకీయ దురంధరుడని.. బాంబులతో పేల్చినా.. దులుపుకుని లేచి వచ్చాడని.. ఇలా చాలా చాలా పొగిడారు. దీనిపై ఇప్పుడు వైసీపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ దిగ్గజం, రాజకీయ పరిజ్ఞాని అని చంద్రబాబును పొగుడు తావా అంటూ వైసీపీ నేత నందమూరి లక్ష్మీ పార్వతి రెచ్చిపోయారు.
చంద్రబాబు రాజకీయ పరిజ్ఞాని, దురంధరుడు అయితే.. జనాల గుండెల్లో ఉంటే.. 2019 ఎన్నికల్లో 23 సీట్లుతోనే ఎందుకు ఓడిపోయాడని పవన్‌ను నందమూరి లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. 40 ఏళ్ల పొలిటికల్‌ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదన్న నందమూరి లక్ష్మీ పార్వతి.. 75 ఏళ్ల వయసున్న ఈ ముసలోడి చుట్టూ ఇప్పుడు 65 కేసులు చుట్టుముట్టి ఉన్నాయన్నారు. ప్రపంచమంతా చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని చెబుతుంటే..  ఒక్క నీకు మాత్రమే ఆయన అవినీతి కనిపించడంలేదని నందమూరి లక్ష్మీ పార్వతి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: