జగన్‌ను.. వైఎస్‌ వివేకా ఓడిస్తాడా?

Chakravarthi Kalyan
ఏపీలో వైఎస్‌ వివేకా హత్య కేసు వార్త మరోసారి వార్తల్లోకి వస్తోంది. ఆయన కుమార్తె.. నర్రెడ్డి సునీత ఈ అంశంపై ప్రెస్ మీట్ పెట్టి వైసీపీకి ఓటు వేయవద్దని చెప్పడం సంచలనంగా మారింది. స్వయంగా సీఎం జగన్‌కు చెల్లెలు అయిన సునీత.. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు చేయడం కలకలం రేపుతోంది. అయితే.. వివేకా హత్య కేసు వచ్చే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తిగా మారింది.
అయితే వివేకా హత్య కేసు కొత్తదేమీ కాదు. గత ఎన్నికల నుంచి ఉన్నదే. అందులోనూ జగన్‌పై నేరాభియోగం లేదు. అయితే.. ఈ కేసులో నిందితులు, అనుమానితులు, బాధితులు ఎక్కువగా అంతా వైఎస్‌ కుటుంబంలోనే వారే. కుటుంబ సభ్యుల మధ్య జగన్ నలిగిపోయారన్న వాదన కూడా ఉంది. కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ సమయంలో నర్రెడ్డి సునీత ప్రెస్ మీట్‌ పెట్టి జగన్‌కు ఓటేయవద్దని చెప్పడం ఎంత వరకూ ప్రభావం చూపుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: