చంద్రబాబును ఒక రేంజ్‌లో పొగిడిన పవన్‌ కల్యాణ్‌?

Chakravarthi Kalyan
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. తాడేపల్లిగూడెం సభలో పవన్ కల్యాణ్‌ చంద్రబాబును విపరీతంగా పొగిడేశారు. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ధురంధరుడు అంటూ మెచ్చుకున్నారు. క్లెమోర్‌ మైన్లతో పేల్చివేసినా.. దుమ్ముదులుపుకుని కారులోనుంచి బయటకు వచ్చిన ధీరుడు అంటూ పవన్ కల్యాణ్‌ చంద్రబాబును ప్రశంసించారు.
అంతేకాదు.. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని.. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టినప్పుడు చాలా బాధ అనిపించిందని పవన్‌ కల్యాణ్ అన్నారు. నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు: అంటూ పవన్‌ కల్యాణ్‌ మెచ్చుకున్నారు. ప్రజల భవిష్యత్తు కోసం రోడ్లపైకి వచ్చానన్న పవన్‌ కల్యాణ్‌.. పవన్‌ అంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు.. పవన్‌ అంటే దేశ యువత కన్నీళ్లు తుడిచే చెయ్యి.. పవన్‌ అంటే ఆడబిడ్డలకు రక్షణగా ఉండే రాఖీ అన్నారు. పవన్‌ అంటే జగన్‌ను నట్టేట ముంచే తుపాను అన్న పవన్‌.. ఒక్కడి ప్రతిఘటన కోట్ల మందికి తిరగబడే ధైర్యం ఇస్తుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: