ఏపీ ఎలక్షన్‌జోరు: బాబు 94.. జగన్‌ 175?

Chakravarthi Kalyan
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇటీవల చంద్రబాబు- పవన్‌ కల్యాణ్‌ సంయుక్తంగా 99 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశారు. అయితే సీఎం జగన్ మాత్రం మొత్తానికి 175 మంది అభ్యర్థులనూ ఖరారు చేశామని చెబుతున్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన జగన్.. పార్టీలో దాదాపు అన్ని సీట్లు దాదాపు ఖరారు చేశామని తేల్చి చెప్పారు.

ఇప్పటికే 99 శాతం సీట్లలో అభ్యర్థులను ఖరారు చేశామన్న జగన్.. ఒకటో అరో ఉంటే మార్చుతామన్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి నియోజకవర్గంలోనూ 87 శాతం ఇళ్లకు మంచి జరిగిందన్న జగన్.. ప్రతి గ్రామంలో, మండలం, నియోజకవర్గంలో మెజారిటీ ఎందుకు రాకూడదని అడుగుతున్నానన్నారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు కులం ప్రస్తావన తెస్తారన్న జగన్.. పేదలు బాగుపడాలంటే వైకాపా అధికారంలోకి రావాలనే విషయాన్ని ఇంటింటికీ వెళ్లి చెప్పాలన్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వని ఆయుధాలను అందరి చేతుల్లో నేను పెట్టానని.. 45 రోజుల్లో చేసే నేతలు, కార్యకర్తలు  చేసే ఆర్గనైజేషన్ స్ట్రేంత్ పైనే ఫలితం ఆధారపడి ఉంటుందని.. గతంలో 151 సీట్లు వచ్చాయి ఈ సారి 175 కు 175ఎమ్మెల్యే  స్థానాలు రావాల్సిందేనని జగన్ పార్టీ నేతలకు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: