టికెట్‌ వచ్చిన టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు వార్నింగ్‌?

Chakravarthi Kalyan
అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాలో ప్రకటించిన 94 మంది అభ్యర్థులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఒక సర్వే చేయిస్తానని హెచ్చరించారు. ఏమాత్రం తేడా వచ్చినా వేటు తప్పదని చంద్రబాబు అభ్యర్థులకు తేల్చిచెప్పారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమన్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టాలని సూచించారు.

పార్టీల్లో ఎవరైనా అసంతృప్తితో ఉంటే వారిని ఒకటికి పదిసార్లు స్వయంగా వెళ్లి కలవాలని... కలుపుకునిపోయేలా జనసేనతో సమన్వయంతో వ్యవహరించాలని చంద్రబాబు అన్నారు. రెండు పార్టీలు సమన్వయంతో పని చేస్తేనే 100 శాతం ఓట్ల బదిలీ జరుగుతుందని చంద్రబాబు అన్నారు.  1.3 కోట్ల మంది అభిప్రాయాలు తీసుకున్నాక.. ఎన్నో సర్వేలు చేయించాక అభ్యర్ధులను ఎంపిక చేశానని చంద్రబాబు అన్నారు. దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఏ పార్టీ కూడా ఇటువంటి ప్రయత్నం చేయలేదన్న చంద్రబాబు ఒక్క సీటూ ఓడిపోవడానికి వీలు లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: