సింపతీ కోసమే కవిత-సీబీఐ డ్రామా?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ ఓట్లు చీలి బీజేపీ, బీఆర్ఎస్‌కు లబ్ది చేకూరాలనుకుంటే ఎమ్మెల్సీ కవిత ను అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అభిప్రాయపడుతున్నారు. బిజెపి, బీఆర్ఎస్‌ సిద్ధాంతాలు లేని పార్టీలని.. సిద్ధాంతాలు చెప్పే డూప్లికేట్ పార్టీలని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. సెక్యులర్ మాటకు కట్టుబడి ఉన్నది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనన్న జగ్గారెడ్డి.. అవకాశ వాద రాజకీయాలు చేస్తుంది బీఆర్‌ఎస్, బీజేపీయేన్నారు. సిద్ధాంతాలు లేవు వాళ్లకన్న జగ్గారెడ్డి.. బీజేపీ లోపాయకారి ఒప్పందంలో భాగంగానే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చిందన్నారు.

కొత్త నాటకం కి రెండు పార్టీలు తెర లేపారన్న జగ్గారెడ్డి.. బీజేపీ కి లాభం ఐతది అనుకుంటే కవితని అరెస్ట్ చేస్తారని.. కవిత ని అరెస్ట్ చేస్తే సింపతి వచ్చి..ఓట్లు డైవర్ట్ అవుతాయని వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చాలి అనేది బీఆర్‌ఎస్‌, బీజేపీ ఆలోచనగా చెప్పిన జగ్గారెడ్డి.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాటలకు విలువ లేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: