ఇవాళే గ్రూప్‌2 పరీక్ష.. ఈ రూల్స్‌ మస్ట్‌?

Chakravarthi Kalyan
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష జరగబోతోంది. దీనికి సంబంధించి నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్షలు ఉన్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరక్కుండా 3971 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణను పర్యవేక్షించేందుకు 24 మంది ఐఎఎస్ అధికారులను నియమించారు.
గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష కోసం 24 వేల 152 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలు,ఇతర సామాగ్రిని తరలించేందుకు 14 ఆర్టీసీ బస్సులు, 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎస్ కె.ఎస్. జవహర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: