నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. జిల్లాల్లో నాలెడ్జ్ సెంటర్లు?

Chakravarthi Kalyan
ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగుల‌కు కోచింగ్ కోసం నియోజకవర్గ కేంద్రాల్లో నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలో టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండ‌ర్ ప్రకటించనున్న నేప‌థ్యంలో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి నిరుద్యోగులకు కోచింగ్ కోసం ఆర్ధిక భారం పడకుండా ఈ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. జ్యోతిబా పూలే ప్రజాభవన్ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా నియోజ‌క‌వ‌ర్గాల్లోని నాలెడ్జ్ సెంటర్లలో నిరుద్యోగుల‌కు ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ ఇచ్చేలా ప్రణాళికలు చేయాలని విద్యా శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశించారు.

అలాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణంపై విద్యా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్స్ కు దీటుగా సమీకృత రెసిడెన్షియల్ పాఠ‌శాల‌ల భ‌వ‌నాలు నిర్మించాలని విద్యా శాఖ అధికారులకు భట్టి విక్రమార్క తెలిపారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాలలు ఒకే చోట నిర్మిస్తే స్థలాల సమస్య అధిగమించి మినీ ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చేసేందుకు వీలవుతుందనితెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: