ధరణిపై రేవంత్‌ రెడ్డి తేల్చేది ఆరోజేనా?

Chakravarthi Kalyan
తెలంగాణలో ధరణి స్థానంలో ప్రత్యామ్నాయంగా భూమాత పేరిట పోర్టల్ అందుబాటులోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. దీనిపై ఈ నెల 24న జిల్లా కలెక్టర్లతో ధరణి కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లోపభూయిష్టంగా మారిన ధరణి పోర్టల్‌ సేవలపై రెవెన్యూ శాఖ, ధరణి కమిటీ సభ్యులు 12 కీలకమైన అంశాలపై జిల్లా కలెక్టర్లతో విస్తృతంగా చర్చిస్తారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ధరణి దరఖాస్తులు, పరిష్కారం నోచుకోకపోవడానికి గల కారణాలను చర్చించే అవకాశం ఉంది. ఆయా సమస్యల పరిష్కారాలపై కమిటీ సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.

ప్రధానంగా ధరణిలో నిషేధిత ఆస్తుల (సెక్షన్ 22A) జాబితాకు సంబంధించిన సమస్యలు - జాబితాను సరిదిద్దేందుకు ఏంచేయాలి.. ఎలా నవీకరించాలని ఆనేది ఆలోచిస్తున్నారు.  ప్రభుత్వం, రెవెన్యూ శాఖ తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యల అవసరం, తాత్కాలిక ల్యాండ్ ట్రిబ్యునల్స్ ద్వారా పరిష్కరించబడిన కేసులు - అనుభవాలు, ముందుకు వెళ్లే మార్గాల గురించి కమిటీ చర్చించే అవకాశం ఉంది. ఈ చర్చల ఆధారంగా ధరణిలో మార్పులు తెచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: