కేసీఆర్‌కు పేరొస్తుందని..రేవంత్‌ ఆ పని చేయట్లేదా?

Chakravarthi Kalyan
కేసీఆర్‌కు ఖ్యాతి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అనవసర భేషజాలకు పోయి రైతులకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పాలమూరు - రంగారెడ్డి నుంచి కాల్వల ద్వారా నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీరు ఇవ్వాలని... కొత్త ఎత్తిపోతలతో లేని వైషమ్యాలు సృష్టించవద్దని, ప్రజలపై భారం వేయవద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సూచించారు. పాలమూరు - రంగారెడ్డిలో ఏడు నుంచి పది శాతం పనులు మిగిలి ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
కరివెన, ఉద్దండాపూర్ నుంచి కేవలం కాల్వలు తవ్వితే నారాయణపేట - కొడంగల్ కు గ్రావిటీ తో నీరు పోతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తాము మంజూరు చేసిన కాల్వల పనులు రద్దు చేసి నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల చేపడుతున్నారని, జూరాలపై ఇప్పటికే ఒత్తిడి ఉంటే మళ్లీ అక్కడి నుంచే చేపడుతున్నారని నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: