మేడారం జాతర ప్రారంభం.. తొలిరోజు ఇదే ప్రత్యేకం?

Chakravarthi Kalyan
ఇవాళ్టి నుంచి మేడారంలో సమ్మక్క- సారలమ్మ జాతర ప్రారంభమైంది. 4 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనుంది. తొలిరోజు ఈ సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వస్తారు. రేపు మేడారం గద్దెలపైకి సమ్మక్క తల్లి చేరుకుంటుంది. ఈ వన దేవతల జాతరకు గవర్నర్, సీఎం హాజరుకానున్నారు. మేడారం జాతరకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా హాజరుకానున్నారు.

ఈనెల 23న రాష్ట్రపతి దర్శించుకుంటారని భావిస్తున్నారు. ఇప్పటికే భక్తులతో మేడారం పరిసరాలు  కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా భక్తుల దర్శనాలు సాగుతున్నాయి. వన దేవతల దర్శనం కోసం భక్తులు  భారీగా తరలివస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌ నుంచి భక్తులు తరలివస్తున్నారు. మొత్తం కోటి మందికి పైగా దర్శనాలు చేసుకుంటారని అంచనా వేసిన ప్రభుత్వం మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేసింది. మేడారం జాతర కోసం టీఎస్‌ ఆర్టీసీ, రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: