గ్రేటర్‌ హైదరాబాద్ బడ్జెట్‌ ఎంతో తెలుసా?

Chakravarthi Kalyan
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి 3500 కోట్లు కావాలని పాలకమండలి సభ్యులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను 8437 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సభ్యులు బడ్జెట్ లో రూపొందించిన పద్దులపై వాడివేడిగా చర్చించారు. గత కాంగ్రెస్ పాలనలో జీహెచ్ ఎంసీకి భారీగానే నిధుల కేటాయింపు జరిగిందని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 9 ఏళ్లలో 1700 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు.
కాంగ్రెస్ కార్పొరేటర్ల విమర్శలపై స్పందించిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు హైదరాబాద్‌ నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి మాట్లాడాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ చేసిన అభివృద్ధిని చూసే నగరంలో ఓట్లు వేశారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. కొందరు సభ్యుల డిమాండ్ తో పారిశుద్ధ్య నిర్వహణ, వాణిజ్య ప్రకటనల అక్రమాలపై హౌజ్ కమిటీ వేస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు. విధుల్లో నిర్లక్ష్యం, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేయనున్నట్లు మేయర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: