బాబు డీలా: బీజేపీతో టీడీపీ.. పొత్తు లేనట్టేనా?

Chakravarthi Kalyan
ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడి రాజకీయ పార్టీల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  ఓవైపు టీడీపీ, జనసేన పొత్తు ప్రకటించి అభ్యర్థులపై దృష్టి సారిస్తున్న సమయంలో బీజేపీ అధిష్ఠానం నుంచి చంద్రబాబు కి పిలుపు వచ్చింది. దీంతో పొత్తు ఖరారైందన్న వార్తలు వచ్చాయి. షామాషీగా చంద్రబాబును అమిత్ షా పిలవరు. సీట్ల విషయం చర్చించడానికే ఆయన్ను దిల్లీ పిలిపించారు అని తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే చంద్రబాబు దిల్లీ వెళ్లి వారం గడుస్తున్నా దీనిపై ప్రకటన రాలేదు. అసలు ఏం జరిగిందే పార్టీ నాయకులకు కూడా చెప్పడం లేదు. దీంతో పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

సహజంగా చంద్రబాబు ఎక్కువగా ప్రచారం కోరుకుంటారు. పొత్తులో సానుకూల సంకేతాలు వస్తే తన అనుకూల మీడియా ద్వారా బీజేపీతో కలిసి నడుస్తున్నామని.. 2014 మాదిరిగా ఇప్పుడు కూడా కలిసే ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పి తద్వారా అధికారంలోకి వచ్చేది తమ కూటమేననే హైప్ సృష్టిస్తారు. కానీ ఈ సారి అలాంటిదేమీ జరగడం లేదు. మరోవైపు బీజేపీ పొత్తుతో సంబంధం లేకుండా పార్టీ కలాపాల్లో తీరిక లేకుండా గడుపుతోంది. ఇప్పటికే 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్ సభ సీట్లకు అభ్యర్థుల లిస్ట్ ను తయారు చేసింది. ప్రతి పార్లమెంట్ పరిధిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేలా కసరత్తులు చేస్తున్నారు.

తప్పని సరి పరిస్థితి అయితే తప్పనించి అధిష్ఠానం నుంచి పొత్తు సంకేతాలు స్థానిక నాయకులకు అందడం లేదు. దీంతో వాళ్లంతా పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పోరు బాట, పల్లె నిద్ర లతో పాటు తాజాగా జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. పొత్తులు ఖరారు అయితే సరే.. లేకుంటే ఒంటరి పోరాటానికి ఆ పార్టీ క్షేత్రస్థాయిలో సిద్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: