హైదరాబాద్‌పై ఇక రేవంత్ రెడ్డి మార్కు చూపిస్తారా?

Chakravarthi Kalyan
అభివృద్ధిలో ఒక్కో నేతది ఒక్కో మార్కు.. ఇక ఇప్పుడు రేవంత్ తన మార్కు చూపించేలా ఉన్నారు. గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ నగరం అభివృద్ధి లో చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు. రాజకీయాలు కు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు , అనుభవాలు ను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. హైదరాబాద్ కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు ను చంద్రబాబు ప్రతిపాదన దాన్ని కొనసాగిస్తూ వైఎస్ ఆర్ పూర్తి చేశారని.. నగరం శివారు ప్రాంతాల్లో రీజనల్ రింగ్ రోడ్డు ను త్వరలో తీసుకొస్తామని రేవంత్ అంటున్నారు.
అగ్ని మాపక ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్న రేవంత్ రెడ్డి అగ్నిమాపక శాఖ కేవలం అగ్ని ప్రమాదాలు కోసమే కాదు, విపత్కర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందిస్తూ ఉంటారని మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: