మంగళగిరిలో మళ్లీ లోకేష్‌కు ఓటమి తప్పదా?

Chakravarthi Kalyan
మంగళగిరిలో గత ఎన్నికల్లో నారా లోకేష్‌కు ఓటమి సంచలనం సృష్టించింది. అయితే ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే కావాలని లోకేష్‌ తపన పడుతున్నారు. ఈసారి మంగళగిరి గెలుస్తామని టీడీపీ నాయకులు పదే పదే చెప్పుకుంటున్నారు. అయితే.. ఈసారి కూడా లోకేష్‌ గెలుపు కలేనని అంటున్నారు వైసీపీ నేతలు. మేము స్పష్టంగా చెప్తున్నాం..ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో వైకాపా గెలుచుకుంటుందని ఇటీవల గుంటూరు జిల్లా ప్రాంతీయ కార్యాలయంలో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త విజయ సాయి రెడ్డి సమావేశంలో అన్నారు.

ఇప్పటికే రెండుసార్లు మంగళగిరిలో గెలిచాం మూడోసారి కూడా గెలుస్తామంటున్నారు విజయసాయిరెడ్డి. అభ్యర్థులను మార్చాలనుకున్న వారిని మారుస్తామని.. లేనిపక్షంలో ప్రస్తుతం ఉన్నవారే కొనసాగుతారని అన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమ్వయకర్తలతో సమావేశం నిర్వహించిన విజయసాయి రెడ్డి.. జిల్లాలోని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో ఎన్నికల విధానాలపై చర్చించామని.. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: