ఏపీ స్పీకర్‌పై నారా లోకేష్ సంచలన ఆరోపణలు?

Chakravarthi Kalyan
ఏపీ స్పీకర్‌ వెయ్యి కోట్లు అక్రమంగా సంపాదించారని నారా లోకేష్ ఆరోపించారు. ఆమదాలవలసలో జనం డమాబుస్ ఎమ్మెల్యేను గెలిపించారని ఆ డమాబుస్ ఎమ్మెల్యే ఇంటర్య్వూను చూశానని...ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అన్నాడని నారా లోకేష్ గుర్తు చేసుకున్నారు. మరి ఎన్టీఆర్ కూతురును అసెంబ్లీలో అవమానిస్తే నువ్వు చేసిందేంటి..పీకిందేంటి.. శాసన సభకు గౌరవం లేకపోవడానికి కారణం ఈ డమాబుస్ ఎమ్మెల్యేనే. సభా సాంప్రదాయాలు ఉల్లంఘించి సభ సాక్షిగా చంద్రబాబును అవమానిస్తే పట్టించుకోలేదన్నారు.
డమాబుస్ ఎమ్మెల్యే..పలాస కొండల రాజుతో అవినీతిలో పోటీ పడుతున్నాడు. ఐదేళ్లలో  ఈ డమాబుస్ ఎమ్మెల్యే రూ.1000 కోట్లు సంపాదించుకున్నాడన్న నారా లోకేష్ .. ల్యాండ్, శ్యాండ్ మాఫియాకు అడ్డాగా ఆముదాలవలసను మార్చాడని.. కాంట్రాక్టర్లును కూడా వేధించాడు. కొడుకు పెళ్లి కోసం రూ.1.30 కోట్లు వసూలు చేశాడు. ఇసుకలో రూ.300 కోట్లు కొట్టేశాడు. వాలంటీర్,అంగన్వాడీ, షిప్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా డబ్బులెక్కువ ఇచ్చిన వారికి అమ్ముకున్నాడన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: