జగన్‌కు కొత్త పేరు పెట్టిన లోకేశ్‌?

Chakravarthi Kalyan
జగన్‌కు నారా లోకేశ్‌ ఇటీవల కొత్త పేరు పెట్టారు. అదే కటింగ్ మాస్టర్. ఆమదాలవలస శంఖారావం సభలో లోకేష్ ప్రసంగం ఇలా విమర్శించారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తానన్న జగన్ నమ్మి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇప్పుడు దాని ఊసే లేదని లోకేశ్ మండిపడ్డారు. సీబీఐ విచారణ చేస్తే ఏ8 నిందితుడిగా అవినాష్ రెడ్డి పేరు వచ్చిందని మరికొన్ని రోజులుంటే జగన్ పేరు కూడా బయటకు వస్తుందని లోకేశ్ అన్నారు.
రేపోమాపో వాలంటీర్ వాస్ ఇంటికొచ్చి గొట్టంపెట్టి గాలి ఊదమని చెప్పి..ఇంత గాలి పీల్చుతున్నారా పన్ను కట్టండని చెప్తారన్న లోకేశ్.. జగన్ అనే ఈ కటింగ్ మాస్టారు..అన్న క్యాంటీన్, పెళ్లికానుక, పండుగ కానుక, 6 లక్షల పెన్షన్లు, విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్ కట్ చేశాడు. చంద్రబాబు సీఎంగా బీమా, విదేశీ విద్య, అన్న క్యాంటీన్, కానుక లాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చారన్న లోకేశ్.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా 100 సంక్షేమ పథకాలు కట్ చేశాడని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: