తెలంగాణలో బీజేపీ యాత్రల ప్లాన్‌ అదిరింది?

Chakravarthi Kalyan
ఈ నెల 20 నుండి బీజేపీ తెలంగాణలో విజయ సంకల్ప యాత్రలు చేయనుంది. 20 నుండి 29 వరకు యాత్రలకు ప్లాన్ చేసింది. పెద్ద ఎత్తున నిర్వహించాలని బీజేపీ కార్యాచరణ రెడీ చేసింది. 5 పార్లమెంట్ క్లస్టర్ లలో 5 విజయ సంకల్ప యాత్రలు చేయనుంది. యాత్రలకు క్లస్టర్ వారీగా పేర్లు పెట్టిన బీజేపీ.. భువనగిరి, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, హైదారాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్ర కి భాగ్యనగరం అని పేరు పెట్టారు.

కరీం నగర్ , మెదక్ , జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు శాతవాహన అని.. అదిలాబాద్, పెద్దపల్లి, నిజమాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కొమురం భీమ్ అని.. మహబూబ్ నగర్, నాగర కర్నూల్, నల్గొండ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు  కృష్ణా అని పేరు పెట్టారు. అలాగే వరంగల్, మహబూబ్ బాద్, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కాకతీయగా పేరు పెట్టారు. మార్చి మొదటి వారంలో పెద్ద బహిరంగ సభ పెట్టే యోచన లో బీజేపీ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: