ఖమ్మంలో కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టిస్తారట?

Chakravarthi Kalyan
ఖమ్మం లోక్ సభ స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీకీ చెమటలు పట్టిస్తామంటున్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 17కు 17స్థానాలు గెలిచేలా మా ఎన్నికల కార్యాచరణ ఉంటుందంటున్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీని ఒడించడమే లక్ష్యంగా భాజపా ముందుకు వెళ్తుందన్న కిషన్ రెడ్డి.. పొదుపు సంఘాల మహిళలతో సమావేశంలో అనేక సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కేసీఅర్ సర్కార్ రేషన్ కార్డులు గత పదేళ్లుగా ఇవ్వలేదని కిషన్ రెడ్డి చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఫించన్లు, ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి.. ఇంత వరకు ఆ ఊసే లేదని.. పొదుపు సంఘాలకు తాము డబ్బులు ఇస్తున్నామని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటిలు తెలంగాణ ప్రజల పట్ల గారడీగా మారాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆర్థిక వనరులు ఎట్లా సమకూర్చుకుంటుందో స్పష్టత లేదన్న కిషన్ రెడ్డి.. అప్పులు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: